Road Accident: సికింద్రాబాద్ లో కూల్ డ్రింక్ లారీ బోల్తా... ఎగబడ్డ స్థానికులు!

  • డివైడర్ ను ఢీ కొన్న శీతలపానీయాల లారీ
  • పోలీసులు చూస్తున్నా కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకెళ్లిన స్థానికులు
  • లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలు
శీతల పానీయాల లోడ్ తో వెళుతున్న ఓ కంటెయినర్ ప్రమాదవశాత్తూ బోల్తా పడటంతో స్థానికులు గోనె సంచుల్లో కూల్ డ్రింక్స్ బాటిళ్లను వేసుకుని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలో జరిగింది. గత అర్థరాత్రి బోయిన్ పల్లి నుంచి తాడ్ బండ్ వెళుతున్న లారీ, మూల మలుపు వద్ద అదుపు తప్పి, డివైడర్ ను ఢీకొని బోల్తా పడగా, డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.

ఈ ప్రమాదంలో లారీడు లోడ్ కూల్ డ్రింక్ బాటిల్స్ కిందపడ్డాయి. వీటికోసం ఎగబడిన స్థానికులు, దొరికినవి దొరికినట్టు తీసుకెళ్లారు. పోలీసులు అక్కడే ఉండి కూడా, బాటిల్స్ తీసుకెళుతున్న వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఆపై క్రేన్ ను రప్పించిన పోలీసులు, లారీని పక్కకు జరిపించి, ట్రాఫిక్ ఆటంకాలను తప్పించారు.
Road Accident
Cool Drinks
Locals
Secunderabad

More Telugu News