Telangana: తెలంగాణలో ఎదరించేవాడు లేకుంటే.. బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది!: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • ఎమ్మెల్సీ ఓటమితో కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయింది
  • కవిత ఓడిపోతుందని ఆయనకు భయం పట్టుకుంది
  • చేర్యాలలో రోడ్ షో నిర్వహించిన కోమటిరెడ్డి బ్రదర్స్
తెలంగాణలో ప్రస్తుతం నియంత పాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా ఎదిరించేవాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుందని హెచ్చరించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లనూ కోల్పోవడంతో మైండ్ బ్లాంక్ అయిందని దుయ్యబట్టారు.

నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి కవిత ఓడిపోతుందని కేసీఆర్ కు భయం పట్టుకుందని కోమటిరెడ్డి ఆరోపించారు. అందువల్లే కేసీఆర్ టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

చేర్యాలలో రోడ్ షో నిర్వహించిన కోమటిరెడ్డి సోదరులు.. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. భువనగిరి అభ్యర్థిగా తనను గెలిపిస్తే ప్రజా గొంతుకగా పోరాడుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
Telangana
TRS
Congress
KCR
komati reddy brothers

More Telugu News