Telangana: లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఫెడరల్ ప్రభుత్వం ఏర్పడుతుంది!: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ

  • కాంగ్రెస్, బీజేపీలకు కాలం చెల్లింది
  • దేవుడి దయుంటే కేసీఆర్ ప్రధాని అవుతారు
  • ముషీరాబాద్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ముషీరాబాద్ లో టీఆర్ఎస్ సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..దేవుడి దయ ఉంటే కేసీఆర్ దేశ ప్రధాని అవుతారని మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. అనంతరం సాయి కిరణ్ స్పందిస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, హజ్‌ హౌస్‌ కమిటీ చైర్మన్‌ వసిఉల్లా, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ సలీం, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
TRS
KCR
Prime Minister
home monister
mahamood ali

More Telugu News