కారణాలు చెప్పలేను, క్షమించమనలేను: విరాట్ కోహ్లీ
- ఆర్సీబీ డబుల్ హ్యాట్రిక్ ఓటమి
- దారుణాతి దారుణంగా మాత్రం ఆడలేదు
- దురదృష్టం వెన్నాడిందన్న కోహ్లీ
మరోరోజు తమది కాకుండా పోయిందని, వచ్చిన అవకాశాలను వదిలేసుకున్నామని చెప్పాడు. ఈ సీజన్ లో తమ జట్టు దారుణాతి దారుణంగా మాత్రం ఆడలేదని, అయితే, అన్ని మ్యాచ్ లలోనూ దురదృష్టమే వెన్నాడిందని చెప్పుకొచ్చాడు. కాగా, నిన్న ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆరో ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఆడిన ఆరు మ్యాచ్ లలో ఓడిపోయిన ఏకైక జట్టుగా ఆర్సీబీ నిలిచింది.