suicide: తెనాలిలో కలకలం.. ఎన్నికల అధికారి ఆత్మహత్య

  • ఎన్నికల విధుల కోసం పెదరావూరు వచ్చిన అధికారి
  • అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు నోట్
  • అధికారి స్వస్థలం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు
ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్, పెదరావూరు ఎన్నికల అధికారి కంచర్ల సాంబశివరావు ఆత్మహత్య చేసుకున్నారు. కార్యాలయంలో డోర్ కర్టెన్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాంబశివరావు స్వగ్రామం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కాగా, ప్రస్తుతం పెదరావూరు, జంగడిగుంటపాలెంలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఆయన వచ్చారు.

సాంబశివరావు ఆత్మహత్యపై  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయన వద్ద సూసైడ్ నోట్ దొరికిందని, అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
suicide
Election officer
Guntur District
tenali
Andhra Pradesh

More Telugu News