Donald Trump: వీళ్లు శరణార్థులా!... కుస్తీ పోటీలకు వెళ్లే వస్తాదుల్లా ఉన్నారు: ట్రంప్ నోటి దురుసు

షార్ట్స్‌లో చూడండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసుతనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవతల ఉన్నది మరో దేశాధినేత అయినా తాను ఏమనాలనుకున్నారో అక్షరం పొల్లుపోకుండా అనేస్తారు. ఎన్ని విమర్శలు వచ్చినా ట్రంప్ లో ఈ గుణం మాత్రం పోలేదు. తాజాగా, అమెరికాకు వలస వస్తున్న శరణార్థులపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. శరణార్థుల పేరుతో అమెరికా వస్తున్న వారి కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరిని చూస్తుంటే శరణార్థుల్లా కనిపించడంలేదని, కుస్తీ పోటీలకు వెళ్లే వస్తాదుల్లా ఉన్నారని ఎద్దేవా చేశారు.

వీళ్లు యూఎఫ్ సీ (మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ పోరాట వేదిక)లో పాల్గొనేవాళ్లలా ఉన్నారు కానీ, శరణార్థులని ఎవరైనా అంటారా? అని తన వాక్చాలత్వం ప్రదర్శించారు. లాస్ వేగాస్ లో రిపబ్లికన్ యూదులతో సమావేశమైన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమెరికాలో ప్రవేశించేందుకు అనుగుణంగా శరణార్థులకు శిక్షణ ఇస్తున్న న్యాయవాదులపైనా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొరటుగా కనిపిస్తున్న వ్యక్తులు సైతం దేశంలోకి ప్రవేశించేలా న్యాయవాదులు శిక్షణ ఇస్తున్నారని ఆరోపించారు. అసలీ శరణార్థుల కార్యక్రమమే పెద్ద కుంభకోణం అని విమర్శించారు.
Go Back to Shorts
Donald Trump
USA

More Telugu News