Chandrababu: నాడు జగన్ పై కేసులు పెట్టించింది చంద్రబాబే: వైఎస్ విజయమ్మ ఆరోపణలు

షార్ట్స్‌లో చూడండి
చంద్రబాబు రౌడీనా? తన కొడుకు జగన్ రౌడీనా? తమతో పెట్టుకుంటే వారి అంతు చూస్తానంటున్న చందబ్రాబు రౌడీనా? అని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన రోడ్ షో లో ఆమె మాట్లాడుతూ, ఆరోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడానికి ముందు ‘అసెంబ్లీకి ఎలా వస్తారో చూస్తాను. ఫినిష్ చేస్తాం’ అన్నారని విమర్శించారు. జగన్ అంతు చూస్తానని అసెంబ్లీలో చంద్రబాబు బెదిరించారని మండిపడ్డారు. ఈ సంఘటనలన్నీ చూస్తే ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు? అని ప్రశ్నించారు. జగన్ పై 31 కేసులున్నాయని చంద్రబాబు ప్రతి సభలో చెబుతున్నారని, తన కొడుకుపై ఆ కేసులు పెట్టించింది చంద్రబాబు కాదా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ తో కుమ్మక్కైన చంద్రబాబు తన కొడుకు జగన్ పై ఈ కేసులు పెట్టించారని ఆరోపించారు.
Go Back to Shorts
Chandrababu
jagan
vijayamma
Telugudesam
YSRCP

More Telugu News