Anantapur District: తాడిపత్రి సీఐ నారాయణ బదిలీ

  • ఎన్నికల కోడ్ నేపథ్యంలో హోం శాఖ సిఫారసులు
  • ఈ మేరకు సీఐ బదిలీ
  • తాడిపత్రి కొత్త సీఐగా శరత్ చంద్ర
అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ నారాయణ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కొత్త సీఐగా శరత్ చంద్రను నియమించారు. ఈ విషయాన్ని ఏపీ ఎన్నికల సంఘం సీఈఓ ద్వివేది ప్రకటించారు. కాగా, తాడిపత్రి కొత్త సీఐగా నియమించబడ్డ శరత్ చంద్ర ప్రస్తుతం సీసీఎస్ సీఐగా ఉన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో హోం శాఖ సిఫారసుల మేరకు నారాయణను బదిలీ చేసినట్టు సమాచారం.
Anantapur District
tadi patri
CI
Narayana
EC

More Telugu News