Balakrishna: రాష్ట్రం వడ్డించిన విస్తరిలా ఉంది, వైసీపీ చేతికి చిక్కితే కుక్కలు చింపిన విస్తరిలా మారుతుంది: బాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజయనగరం జిల్లా నెల్లిమర్లలో రోడ్ షోలో పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థి పతివాడ నారాయణస్వామికి మద్దతుగా రంగంలోకి దిగిన బాలయ్య తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీని కేంద్రం అన్ని విధాలా మోసం చేసిందని అన్నారు. వైసీపీకి ఓటేస్తే మోదీకి ఓటేసినట్టేనని చెప్పారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం వడ్డించిన విస్తరిలా ఉందని, ఇప్పుడది వైసీపీ చేతికి చిక్కితే కుక్కలు చింపిన విస్తరి అవుతుందని వ్యాఖ్యానించారు.  

పోలింగ్ రోజున ప్రజలు తీసుకునే నిర్ణయంపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్న చంద్రబాబుకు అందరూ సహకారం అందించాలని బాలయ్య విజ్ఞప్తి చేశారు. టీడీపీ వస్తేనే పిల్లలకు, యువతకు మంచి భవిష్యత్తు లభిస్తుందని తెలిపారు.
Go Back to Shorts
Balakrishna
Chandrababu
Telugudesam

More Telugu News