సెల్ఫీ ఇవ్వు.. లేదంటే నీ గాల్ ఫ్రెండ్ ను చంపేస్తా!: హీరో వరుణ్ ధావన్ కు లేడీ ఫ్యాన్ బెదిరింపులు

షార్ట్స్‌లో చూడండి
నటీనటుల అభిమానులు అందరూ ఒకే రకంగా ఉండరు. కొందరు పద్ధతిగా ప్రవర్తిస్తే, మరికొందరు మాత్రం తమ అభిమాన హీరో, హీరోయిన్ ను చూసేందుకు ఎంతకైనా తెగిస్తారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ముంబైలో చోటుచేసుకుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కు వీరాభిమాని అయిన ఓ అమ్మాయి అతని ఇంటి ముందు హడావుడి చేసింది.

వరుణ్ ను కలుసుకునేంత వరకూ వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేసింది. చివరికి షూటింగ్ తో అలసిపోయి ఇంటికొచ్చిన వరుణ్ ఆమెను కలుసుకోకపోవడంతో చిందులు తొక్కింది. వరుణ్ తనను కలుసుకోకపోతే అతడి ప్రియురాలిని చంపేస్తానని బెదిరించింది. దీంతో భధ్రతా సిబ్బంది సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెకు నచ్చజెప్పి పంపించివేశారు.

నిన్న సాయంత్రం ఓ యువతి వరుణ్ ధావన్ ఇంటి వద్దకు చేరుకుంది. ఆయన్ను కలుసుకుని సెల్ఫీ దిగాలనుకుంటున్నట్లు చెప్పింది. దీంతో ‘వరుణ్ సార్ షూటింగ్ కు వెళ్లారు. రావడానికి ఆలస్యం అవుతుంది’ అని చెప్పారు. అయితే వారి మాటలను పట్టించుకోని యువతి అక్కడే ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న వరుణ్ అభిమానులను కలుసుకోకుండా లోపలకు వెళ్లిపోయారు. దీంతో వరుణ్ ను తాను వెంటనే కలవాలని యువతి చిందులు తొక్కింది.

అందుకు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో ‘వరుణ్ ఇప్పుడు బయటకు రాకపోతే నేను అతడి గాల్ ఫ్రెండ్ నటాషాను చంపేస్తా. నాతోనే సెల్ఫీ దిగవా.. ఏం చేస్తానో చూడు’ అని బెదిరింపులకు దిగింది. దీంతో అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు యువతికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ గతకొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారు. వచ్చే ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాల సమాచారం.
Go Back to Shorts
Bollywood
varun dhawan
girl firend
natasha
warning
Police

More Telugu News