Andhra Pradesh: వైసీపీ మహిళతో భన్వర్ లాల్ కు అక్రమ సంబంధం అంటగట్టాలని చంద్రబాబు చూశాడు!: ఆమంచి సంచలన ఆరోపణ

  • నంద్యాల ఉప ఎన్నికలప్పుడు ఇది జరిగింది
  • ఈ విషయంలో నార్కో అనాలసిస్ కు సిద్ధమా?
  • ఇది నిజం కాదని దేవాన్ష్ పై ప్రమాణం చేస్తారా?
  • చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కేసు పెడితే చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై 17 కేసులు ఉన్నాయనీ, ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయి అని వ్యాఖ్యానించారు. తాను ప్రజా ఉద్యమంలో ఉన్నప్పుడు కేసులు పెట్టారని స్పష్టం చేశారు. చీరాలలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమంచి కృష్ణమోహన్‌ మాట్లాడారు.

చీరాలకు విమానాశ్రయం తీసుకొస్తానని చంద్రబాబు జోక్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఏం అవసరమో బాబుకు అస్సలు అవగాహన లేదని దుయ్యబట్టారు. ప్రజల పన్నులతో చీరాలను అభివృద్ధి చేసుకున్నామనీ, చంద్రబాబు చీరాలకు పెద్దగా ఇచ్చిన నిధులేమీ లేవని స్పష్టం చేశారు. ఏపీలో అతి తక్కువ నిధులు చీరాలకే వచ్చాయన్నారు.

‘నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అప్పటి ఎన్నికల అధికారి భన్వర్ లాల్ మనకు వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రచారానికి వచ్చిన వైసీపీ మహిళల్లో ఒకరితో ఆయనకు అక్రమ సంబంధం అంటగట్టాలని టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో చెప్పిన నీచుడు చంద్రబాబు. ఇది నిజం కాదా? దీనిపై నార్కో అనాలసిస్ కు సిద్ధమా? నీ మనవడు దేవాన్ష్ పై ప్రమాణం చేసి చెబుతావా’ అని ప్రశ్నించారు. ఏపీలో ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆమంచి వైసీపీ తరఫున చీరాల అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
amanchi

More Telugu News