Hyderabad: హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఇంటిపై పోలీసుల దాడి

  • సోదాల సమయంలో ఇంట్లోలేని భిక్షపతి కుటుంబం
  • సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలేంటంటూ కాంగ్రెస్ ఆగ్రహం
  • భిక్షపతి ఇంటికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
కాంగ్రెస్ నేత, హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఇంటిపై శనివారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. గచ్చిబౌలి మసీదు బండలోని ఆయన ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో బంధువుల ఇంట్లో ఉన్న భిక్షపతి కుటుంబం సమాచారం అందిన వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరింది. కాగా, ఇంట్లో ఎవరూ లేకుండా పోలీసులు సోదాలకు దిగడంపై భిక్షపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తారంటూ కాంగ్రెస్ నేతలు పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. భిక్షపతి ఇంట్లో పోలీసుల సోదాలపై సమాచారం అందుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. 
Hyderabad
Bhikshapati
MLA
Congress
Police
Telangana

More Telugu News