Chandrababu: జగన్, అమరావతిని చూస్తే నీకెందుకింత అసూయ?: సూటిగా ప్రశ్నించిన చంద్రబాబు

  • రాజధానిని మార్చాలనుకుంటున్నావా?
  • నీ వల్ల అవుతుందా?
  • నువ్వు మనిషేనా?
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోమారు జగన్ పై నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా పొన్నూరు రోడ్ షోలో ఆయన ప్రసంగిస్తూ జగన్ ను నిలదీశారు. జగన్ తన ప్రసంగాల్లో ఒక్కసారి కూడా అమరావతి గురించి మాట్లాడడంలేదని, రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడని ప్రతిపక్ష నేత ఎవరైనా ఉంటారా అంటూ ప్రశ్నించారు. "జగన్ నీకు అమరావతి అంటే ఎందుకు అసూయ? రాష్ట్ర రాజధానిని మార్చాలనుకుంటున్నావా? నీ వల్ల అవుతుందా? రాష్ట్రానికి నడిబొడ్డున రాజధానిని పెడితే నచ్చని వ్యక్తిని ఏమనాలి? జగన్ ది వితండవాదం, మూర్ఖత్వం. అసలు, ఇతనో మనిషా? ఇలాంటి వ్యక్తి వల్ల ఏమైనా లాభాలు ఉంటాయా?" అంటూ మండిపడ్డారు.

అంతకుముందు ఆయన మాట్లాడుతూ, జగన్ ప్రతిరోజు సాయంత్రానికి లోటస్ పాండ్ చేరుకుని కేసీఆర్ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. ఆయనికి ఇక్కడ విషయాలు చెప్పి, ఆయన చెప్పినట్టు చేస్తుంటాడని విమర్శించారు. ఆ తర్వాత మళ్లీ రాష్ట్రానికి వస్తుంటాడని, ఇలాంటి నాయకుడు మనకి అవసరమా అని ప్రజలను అడిగారు.
Chandrababu
Jagan

More Telugu News