Mohan Babu: 130 సీట్లతో జగనే సీఎం అవుతాడు: మోహన్ బాబు

  • వైఎస్సార్ బాటలోనే సుపరిపాలన అందిస్తాడు
  • చంద్రబాబు టీడీపీని వాడుకుంటున్నాడు
  • ఇప్పుడున్నది ఎన్టీఆర్ టీడీపీ కాదు
ఇటీవలే వైసీపీలో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. విశాఖ జిల్లా అరిలోవలో మోహన్ బాబు వైసీపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు టీడీపీని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాడని మండిపడ్డారు. ఇప్పుడున్నది ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కాదని ఆయన పునరుద్ఘాటించారు. ఒకప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని మోహన్ బాబు పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి 130 సీట్లు రావడం ఖాయమని, జగన్ సీఎం కావడం తథ్యమని మోహన్ బాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్ కూడా తండ్రి వైఎస్సార్ బాటలోనే సుపరిపాలన అందిస్తారని చెప్పారు.
Mohan Babu
Chandrababu
Jagan

More Telugu News