Telugudesam: టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ కీలక నేత మండవ

  • గులాబీ తీర్థం పుచ్చుకున్న మండవ
  • పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్
  • కాంగ్రెస్ నేత గాయత్రీ రవి కూడా పార్టీలో చేరిక
తెలంగాణలో గత కొంతకాలంగా టీడీపీకి ఎదురుగాలి వీస్తున్న సంగతి తెలిసిందే. అటు ఎన్నికల్లో ఓటమిని పక్కనబెడితే అధికార టీఆర్ఎస్ పార్టీలోకి నాయకుల వలసల కారణంగా టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇటీవల కేసీఆర్ స్వయంగా మండవ వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడి, పార్టీలోకి ఆహ్వానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో ఈ రోజు సీఏం కేసీఆర్ సమక్షంలో మండవ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత గాయత్రీ రవి కూడా టీఆర్ఎస్ లో చేరారు.
Telugudesam
KCR
Telangana

More Telugu News