Andhra Pradesh: రేపు టీవీల్లో ‘యాత్ర’ సినిమాను ఆపేయాలన్న టీడీపీ విజ్ఞప్తిని తిరస్కరించిన ఈసీ!

యాత్ర సినిమాను అడ్డుకోవాలని టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదును ఈసీ తోసిపుచ్చింది. స్టార్ మా ఛానల్ లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానున్న యాత్ర సినిమా ఎన్నికల నియమావళిని ఏ రకంగానూ ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదును తమ మీడియా సర్టిఫికేషన్ కమిటీ పరిశీలించిందనీ, అందులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలేవీ లేవని తేల్చిచెప్పింది. ఈ మేరకు టీడీపీ నేతల ఫిర్యాదుకు ఈసీ జవాబు ఇచ్చింది. ఈ మేరకు టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు ఈసీ లేఖ రాసింది.
సరిగ్గా ఎన్నికలకు 4 రోజుల ముందు వైఎస్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాను టీవీల్లో ప్రసారం చేయడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ద్వారా  ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముందనీ, పోలింగ్ ముగిసేవరకూ చిత్రాన్ని ప్రదర్శించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని కోరారు. టీడీపీ నేత వర్ల రామయ్య నేతృత్వంలో పలువురు నేతలు ఈసీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కాగా, టీడీపీ నేతల ఫిర్యాదును పరిశీలించిన ఈసీ ‘స్టార్ మా’ ఛానల్ లో యాత్ర సినిమా రేపు ప్రసారం కాకుండా నిలిపివేసేందుకు నో చెప్పింది.
Andhra Pradesh
Telugudesam
yatra
Tollywood
ec
varla

More Telugu News