Jagan: వైసీపీ అధికారంలోకి వస్తే.. ఏపీలో 25 జిల్లాలు చేస్తాం!: జగన్ కీలక హామీ

  • ప్రస్తుతం 13 జిల్లాలు
  • ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఓ జిల్లానే
  • చర్చించామన్న జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత, ప్రస్తుతమున్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తామని వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని ఆయన అన్నారు. ఈ ఉదయం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్, ఇప్పటికే జిల్లాల ఏర్పాటు, అందుకు సంబంధించిన విధి విధానాలపై చర్చించామని తెలిపారు. దేవుడి దయవల్ల, ఏపీ ప్రజల మద్దతుతో వైసీపీ అధికారంలోకి వస్తే, పరిపాలనను మరింత సులువుగా చేసేందుకు, సంక్షేమాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు జిల్లాల సంఖ్యను పెంచుతామని చెప్పారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను ఓ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు.
Jagan
District
Lok Sabha
YSRCP

More Telugu News