Andhra Pradesh: వైసీపీలో చేరిన టీడీపీ నేత అరవిందబాబు మేనల్లుడు!

  • వైసీపీ తీర్థం పుచ్చుకున్న జనసేన నేత నరసింహారావు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్
  • ఏపీలో భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నరసింహారావు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు గడువు సమీపించినప్పటికీ రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నరసరావుపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి డా.చదలవాడ అరవిందబాబు మేనల్లుడు డా.అశ్వినీకాంత్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన భార్య రమ్యతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు.

అలాగే జనసేనకు చెందిన కీలక నేత, ఏపీ వేర్‌హౌజింగ్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ గుంటూరు వెంకట నరసింహారావు, తన కుటుంబ సభ్యులతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి జగన్ తోనే సాధ్యమని తెలిపారు. టీడీపీ పాలనలో అన్నివర్గాలకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఏపీలో భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.
Andhra Pradesh
YSRCP
Jagan
Telugudesam
Jana Sena

More Telugu News