Telangana: తెలంగాణకు బీజేపీ చేసిన పనేంటో ఒకటి చెప్పాలి?: కేటీఆర్

  • ఇది అత్యంత కీలకమైన ఎన్నిక
  • బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి, కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ కి లాభం
  • టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే ‘తెలంగాణ’కు లాభం
తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిన పనేంటో ఒకటి చెప్పాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటి ప్రశ్న వేశారు. సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ వద్ద నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, ఇది అత్యంత కీలకమైన ఎన్నిక అని అన్నారు.

బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి, కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ కి లాభమని, అదే, టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభమని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. మోదీ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశమే లేదని, అదేవిధంగా, టీ-బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా కారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ వాళ్లకు ‘దేవుడు’ గుర్తుకొస్తాడని విమర్శించారు. 
Telangana
TRS
KTR
Hyderabad
modi
rahul

More Telugu News