Narendra Modi: సార్వత్రిక ఎన్నికల ప్రారంభం రోజునే ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ విడుదల

  • 11న బయోపిక్ విడుదల
  • సినిమాను నిలిపి వేయాలని కోరుతూ పిటీషన్
  • సోమవారం వాదనలు వింటామన్న కోర్టు
ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్రమోదీ’ని కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన ఆ చిత్ర నిర్మాత సందీప్ సింగ్, తాజాగా మరో ప్రకటన చేశారు. ఆ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశామని, ఈ నెల 11న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది.

ఎన్నికలు ముగిసే వరకూ ఈ చిత్రం విడుదలను నిలిపి వేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత ఒకరు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు సోమవారం వింటామని కోర్టు తెలిపింది. అయినా కూడా సార్వత్రిక ఎన్నికల ప్రారంభం రోజునే సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నద్ధమవుతోంది.
Narendra Modi
Biopic
Sandeep Singh
Supreme Court
Congress

More Telugu News