Narendra Modi: ఎన్నికల్లో జగన్ గెలిస్తే ప్రాజెక్టులన్నీ కేసీఆర్ హస్తగతమవుతాయి: చంద్రబాబు

  • మోదీని చూస్తే జగన్‌కు భయం
  • ప్రజలను తాకట్టు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు
  • ప్రభుత్వ సొమ్మును పంచుతుంటే అడ్డుకుంటున్నారు
  • కాల్వలో పారేది నీరు కాదు, కన్నీరు
ప్రధాని మోదీని చూస్తే వైసీపీ అధినేత జగన్‌కు భయమని, అందుకే ఏపీ ప్రజలను తాకట్టు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. నేడు ఆయన  కర్నూలు జిల్లా నందికొట్కూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఏపీ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ హస్తగతమవుతాయన్నారు.

ప్రభుత్వ సంపదను ప్రజలకు పంచుతుంటే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇకపై ప్రతి ఏడాది మహిళలకు ‘పసుపు-కుంకుమ’ ఇస్తానని ప్రకటించారు. మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడులను మూసివేయాలని కేసీఆర్ కోరుతున్నారని, అవి మూసేస్తే రాయలసీమ ఎడారి అవుతుందన్నారు. జగన్ అధికారంలోకి వస్తే కాల్వల్లో పారేది నీరు కాదని, కన్నీరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని ప్రత్యేక హోదా అడిగితే ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Narendra Modi
YSRCP
Jagan
Chandrababu
KCR
Kurnool District

More Telugu News