USA: అమెరికాలో యాదాద్రి జిల్లా వాసి మృతి

షార్ట్స్‌లో చూడండి
అమెరికాలో తెలుగు వ్యక్తి ఒకరు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. యాదాద్రి జిల్లా నల్లపోచమ్మ వాడకు చెందిన నాయకం కాశీ విశ్వనాథ్ షార్లెట్ లో ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మూడున్నరేళ్లుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా విధులు నిర్వర్తిస్తున్న కాశీ విశ్వనాథ్ వయసు 26 సంవత్సరాలు. బుధవారం ఉదయం ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో స్నేహితులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి దిగ్భ్రాంతికి గురయ్యారు. విగతజీవిగా పడివున్న అతడిని స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు.

 కాశీ విశ్వనాథ్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవని, ఎలా మరణించాడో అర్థం కావడంలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రస్తుతం అతడి శరీరం నుంచి సేకరించిన శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.
Go Back to Shorts
USA

More Telugu News