malinga: గంటల వ్యవధిలో రెండు దేశాల్లో క్రికెట్ ఆడి.. సత్తా చాటిన మలింగా

  • బుధవారం రాత్రి ఐపీఎల్ ఆడిన మలింగా
  • మరుసటి రోజు 9.45 గంటలకు శ్రీలంకలో సూపర్ ఫోర్ టోర్నీ
  • 10 గంటల వ్యవధిలో 10 వికెట్లు కూల్చేశాడు
శ్రీలంక స్టార్ బౌలర్ మలింగా తన ఫిట్ నెస్ ఎలాంటిదో ప్రపంచానికి చాటి చెప్పాడు. గంటల వ్యవధిలో రెండు దేశాల్లో రెండు మ్యాచ్ లు ఆడి, ఇరగదీశాడు. వివరాల్లోకి వెళ్తే, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న మలింగా... చైన్నై సూపర్ కింగ్స్ తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 34 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. అర్ధరాత్రి 1.40కి ఇండియాలో బయల్దేరి తెల్లవారుజామున 4.30కి శ్రీలంక చేరుకున్నాడు. ఉదయం 9.45 గంటలకు వన్డే సూపర్ ఫోర్ టోర్నీలో ఆడాడు. ఈ మ్యాచ్ లో 49 పరుగులిచ్చి 7 వికెట్లు కూల్చాడు. కేవలం 10 గంటల వ్యవధిలలో రెండు దేశాల్లో రెండు మ్యాచ్ లు ఆడిన ఘనతను సాధించాడు.
malinga
two
countries
matches
Sri Lanka

More Telugu News