puttaparthi: పుట్టపర్తి నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో తీవ్ర గందరగోళం

  • ఆరు మండలాలకు కలిపి ఒకే చోట పోలింగ్
  • కనీస వసతులు కూడా కల్పించని అధికారులు 
  • అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఓటర్లు
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆరు మండలాలకు కలిపి పుట్టపర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఓటింగ్ కు ఏర్పాట్లు చేశారు. మొత్తం 3,850 మంది ఓటర్లు అక్కడకు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కనీస వసతులు కూడా లేకపోవడంతో... చంటిబిడ్డల తల్లులు, మహిళలు ఇబ్బంది పడ్డారు. తాగునీటి సౌకర్యం, ఫ్యాన్లు కూడా లేకపోవడంతో ఓటర్లు మండిపడ్డారు. ఎన్నికల అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
puttaparthi
postal ballot

More Telugu News