hema: పూరి జగన్నాథ్ ను పట్టుకుని ఏడ్చేశాను: సీనియర్ నటి హేమ

షార్ట్స్‌లో చూడండి
తెరపైనే కాదు .. బుల్లితెర ఇంటర్వ్యూల్లోనూ హేమ గలగలా మాట్లాడేస్తూ ఉంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, పూరి జగన్నాథ్ తో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించింది. "పూరి జగన్నాథ్ ను నేను అన్నయ్య అని పిలుస్తుంటాను .. ఒక చెల్లెలిగా ఆయన దగ్గర నాకు చనువు వుంది. కొన్ని కారణాల వలన ఈ మధ్య అన్నయ్యపై అలిగి మాట్లాడటం లేదు. ఇటీవలే ఒక సందర్భంలో కలిసినప్పుడు మాట్లాడాను.  చాలా కాలం తరువాత కలవడం వలన గట్టిగా పట్టుకుని ఏడ్చేశాను.

కొన్ని సంవత్సరాల క్రితం నాకు తెలిసిన జగన్ వేరు .. ఇటీవల నేను చూసిన జగన్ వేరు. డ్రెస్సింగ్ .. హెయిర్ స్టైల్ అన్నీ మారిపోయాయి. ప్రస్తుతం చేస్తోన్న సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలని చెప్పాను. లేకపోతే ఊర్కునేది లేదని గట్టిగా చెప్పాను. 'నువ్వు కాకపోతే ఎవరు తిడతారేనన్ను ..' అంటాడే తప్ప మరేమీ మాట్లాడడు. మా అన్నయ్యను మళ్లీ ఇంతకుముందులా చూడాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.
Go Back to Shorts
hema
puri jagannath

More Telugu News