hema: టాలీవుడ్ హీరోల గురించి మనసులో మాట చెప్పిన హేమ

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలను పోషిస్తూ హేమ మంచి పేరు తెచ్చుకుంది. కోపంతో విరుచుకుపడే పాత్రలనే కాదు .. హాస్యంతో కూడిన పాత్రలను కూడా ఆమె చాలా తేలికగా చేసేస్తుంది. సన్నివేశాలు సహజంగా రావడం కోసం నటన పరంగా ఆమె తనదైన ముద్ర వేస్తుంది. అలాంటి హేమ తాజా ఇంటర్వ్యూలో తనకి ఎదురైన ప్రశ్నలకి సమాధానంగా, టాలీవుడ్ హీరోల గురించి తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది.

తనకి చిరంజీవిగారు స్ఫూర్తి అనీ .. ఆ స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చానని చెప్పింది. చిరంజీవిగారు అంటే ఎంత అభిమానమో .. నాగార్జునన్నా తనకి అంతే అభిమానమని అంది. చిరంజీవి మెగాస్టార్ అయితే నాగార్జున లవర్ బాయ్ అనీ, ఎన్టీఆర్ హార్డ్ వర్కర్ అని చెప్పింది. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ .. చాలా కష్టపడి ఈ రోజున స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడని అంది. మహేశ్ బాబు విషయానికొస్తే .. 'పోకిరి' తరువాతనే తనకి ఆయన మ్యాన్లీగా కనిపిస్తున్నాడనీ, చరణ్ మాత్రం కొడుకులా అనిపిస్తూ ఉంటాడని చెప్పింది. ఇక ప్రభాస్ మాత్రం హైట్ పరంగా చూసుకుంటే తనకి సరిజోడి అనిపిస్తూ ఉంటాడంటూ నవ్వేసింది.
Go Back to Shorts
hema

More Telugu News