cm ramesh: వైయస్ అవినాశ్ రెడ్డి ఇంట్లో దాడులు ఎందుకు చేయలేదు: కనకమేడల

  • టీడీపీ నేతలపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి?
  • ఎన్నికల సంఘం ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది
  • ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబుకే ప్రజలు పట్టం కడతారు
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు దాడులు జరపడంపై ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు. ఇవి సాధారణ దాడులేనని పోలీసులు చెబుతున్నారని... సాధారణ దాడులైతే వైయస్ అవినాశ్ ఇంట్లో ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం టీడీపీ నేతలపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు.

 తాము ఫిర్యాదులు చేస్తున్నా ఈసీ పట్టించుకోవడం లేదని... ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఈసీపై ఉందని అన్నారు. ఇలానే జరుగుతూ పోతే... ఎన్నికల సంఘం ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఓడిపోతామనే భయంతోనే దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా... చంద్రబాబుకే ప్రజలు పట్టం కడతారని చెప్పారు.
cm ramesh
ys avinash reddy
kanakamedala
Telugudesam
ysrcp

More Telugu News