Chandrababu: ఐటీ దాడులకు నిరసనగా.. విజయవాడలో ధర్నాకు దిగాలని చంద్రబాబు సంచలన నిర్ణయం!

  • ఇప్పటికే పలువురిపై దాడులు
  • కావాలనే చేయిస్తున్నారంటున్న టీడీపీ
  • వైసీపీ, బీజేపీ కుమ్మక్కై దాడులు చేయిస్తున్నాయంటున్న టీడీపీ 
విజయవాడ నడిబొడ్డున ధర్నా చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై జరుగుతున్న ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ, ఆయన నిరసనకు దిగాలని నిర్ణయించుకున్నారు.

కాగా, గత కొన్ని రోజులుగా పలువురు టీడీపీ నాయకులపై ఐటీ, పోలీసుల దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్థులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులతో పాటు నారాయణ విద్యా సంస్థలు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నివాసం తదితర ప్రాంతాల్లో సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వైసీపీతో కుమ్మక్కయిన బీజేపీ, ఈసీని వాడుకుంటూ ఈ దాడులు చేయిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.
Chandrababu
Protest
Vijayawada
Raids
Police

More Telugu News