Ahmed shehzad: క్యాచ్ వదిలేసి రివ్యూ కోరిన అహ్మద్ షెజాద్.. క్రికెట్ ప్రపంచం ముందు అభాసుపాలు

  • పాకిస్థాన్ కప్‌ టోర్నమెంటులో ఘటన
  • చేతిలో పడిన క్యాచ్‌ను వదిలేసిన అహ్మద్ షెజాద్
  • రివ్యూ కోరి అడ్డంగా దొరికిపోయిన వైనం
క్యాచ్ వదిలేసి రివ్యూ కోరిన పాక్ క్రికెటర్ అహ్మద్ షెజాద్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ‘పాకిస్థాన్ కప్’లో భాగంగా ఈ నెల 2న లిస్ట్ ఎ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఇందులో ఐదు జట్లు పాల్గొంటున్నాయి.  ఫెడరల్ ఏరియాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షెజాద్.. ఖైబర్ పఖ్తుంఖ్వాతో జరిగిన మ్యాచ్‌లో చేతిలో పడిన క్యాచ్‌ను వదిలేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు రివ్యూ కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఖైబర్ పఖ్తుంఖ్వా ఆటగాడు ఖుష్‌దిల్ షా భారీ షాట్‌కు యత్నించాడు. డీప్ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షెజాద్ బంతిని అందుకునే ప్రయత్నంలో జారవిడిచాడు. కిందపడిన బంతిని తిరిగి చేతిలోకి తీసుకుని క్యాచ్ అందుకున్నట్టు నటించాడు. అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించడంతో రివ్యూ కోరి అభాసుపాలయ్యాడు. కిందపడిన బంతిని తీరిగ్గా చేతుల్లోకి తీసుకున్నట్టు రివ్యూలో స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతుండడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ ఆటగాళ్లు చీటింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అయితే, షెజాద్ ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాగే ప్రవర్తించి నాలుగు నెలల నిషేధానికి గురయ్యాడు.
Ahmed shehzad
Review
Dropping catch
Pakistan
Crime News

More Telugu News