Chandrababu: బెడ్ రూమ్ లోకి కూడా వస్తారా?... పోలీసుల దాడులపై చంద్రబాబు మండిపాటు!

  • నేడు సీఎం రమేశ్ ఇంటిపై దాడులు
  • రెండు వారాలుగా దాడులు జరుగుతున్నాయి
  • బీజేపీ ప్రోద్బలంతోనేనన్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్రోద్బలంతో దాడులు జరుగుతున్నాయని, వీటిని అడ్డుకుని తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపై పోలీసులు దాడులు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఓ ఎంపీగా ఉన్న ఇంటిపైకి 50 మంది పోలీసులను పంపించి, ఇంట్లోని వారిని ఆందోళనకు గురి చేశారని ఆరోపించిన ఆయన, పోలీసులు పడకగదిలోకి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. కక్ష పూరితంగానే రమేశ్ ఇంటిపై దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడచిన రెండు వారాలుగా ఎంతో మంది టీడీపీ నేతల ఇళ్లు, ఆసుపత్రులు, కంపెనీలు, విద్యా సంస్థలపై దాడులు జరిగాయని, ఇంకా మరింత మందిని బీజేపీ టార్గెట్ చేసుకోవాలని చూస్తోందని చంద్రబాబు ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Chandrababu
Telugudesam
Angry
Raids
Police

More Telugu News