Sharmila: నమాజ్ వినిపించడంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన షర్మిల

  • నమాజ్ ముగిసిన తర్వాత ప్రసంగం కొనసాగింపు
  • ఉంగుటూరులో షర్మిల రోడ్ షో
  • చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతుండగా ఆసక్తికర ఘటన జరిగింది. షర్మిల ప్రసంగం కొనసాగుతుండగా దగ్గర్లో ఉన్న మసీదు నుంచి నమాజ్ వినిపించడంతో ఆమె ఒక్కసారిగా తన ప్రసంగం నిలిపివేశారు. నమాజ్ పూర్తయ్యేవరకు వేచి ఉండి, ఆ తర్వాత ప్రసంగం కొనసాగించారు.

షర్మిల తన ప్రసంగంలో సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు నిజం చెప్పే అలవాటు లేదని, ఆయన ఏ రోజైతే నిజం చెబుతారో, ఆ రోజున ఆయన తల వెయ్యి వక్కలవుతుందని అన్నారు. వైసీపీకి ఇతర పార్టీలతో పొత్తు అంటకడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింహం సింగిల్ గానే వస్తుందని చెప్పారు. దేశంలోని అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయని వెల్లడించారు.
Sharmila
Chandrababu
YSRCP
Telugudesam

More Telugu News