ఏపీలో ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చెప్పలేం కానీ, ఆయనకు రిటైర్మెంట్ మాత్రం ఖాయం: కేటీఆర్
- మల్కాజ్‌గిరికి రేవంత్‌రెడ్డి ఏమైనా లోకలా?
- నిజామాబాద్‌లో కచ్చితంగా గెలుస్తాం
- ప్రచారం మానేసి ఇళ్లకు పరిమితమవుతున్నారు
- టికెట్ ఇవ్వకుండా గొంతు కోశారనడం సరికాదు
నిజామాబాద్‌లో కచ్చితంగా గెలుస్తామని, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం మానేసి ఇళ్లకు పరిమితమవుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నామా నాగేశ్వరరావు కోసం తీవ్రంగా ప్రయత్నించిన కాంగ్రెస్ చివరకు రేణుకా చౌదరి పేరును జాబితాలో చేర్చిందని పేర్కొన్నారు. టికెట్ ఇవ్వకుండా గొంతు కోశారని వివేక్ అనడం సరికాదని, పార్టీని అంటి పెట్టుకుని ఉంటే అవకాశాలు వస్తాయన్నారు. చేవెళ్ల ఒక మినీ ఇండియా అని, అక్కడ లోకల్, నాన్ లోకల్ అనేది వర్కవుట్ కాదని కేటీఆర్ పేర్కొన్నారు.