Chittor: టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఐదుగురికి గాయాలు

  • ఘర్షణలో ఒక బైక్ ధ్వంసం
  • పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
  • భద్రత కట్టుదిట్టం
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటోంది. తాజాగా చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం పీబీవాడలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన ఐదుగురు కార్యకర్తలకు గాయాలవగా, ఒక బైక్ ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇకపై ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు తావివ్వకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Chittor
Telugudesam
YSRCP
Bike
Police

More Telugu News