kamal: అభిమానులు క్షమించాలి .. సినిమాలు మానేస్తాను: కమలహాసన్

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున రాజకీయ సంబంధమైన వ్యవహారాలను చక్కబెడుతూనే, మరో వైపున 'భారతీయుడు 2' సినిమా షూటింగులో కమల హాసన్ పాల్గొంటున్నారు. ఈ సినిమా తరువాత తాను ఇక నట జీవితానికి స్వస్తి చెబుతాననీ, పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని కొన్ని రోజుల క్రితం కమల్ ఒక వేదికపై అన్నారు. అయితే ఆయన నిజంగానే సినిమాలు చేయడం మానేస్తారా? మాట వరుసకు అలా అన్నారా? అనే సందేహం అభిమానుల్లో వుంది. తాజాగా కమల్ మాట్లాడుతూ ఆ సందేహాలకు తెరదించేశారు.

"ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో నా పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయించాలని నిర్ణయించుకున్నాను. ఇది నా అభిమానులకు నిరాశను కలిగించే విషయమే. అలాంటి అభిమానులంతా నన్ను క్షమించాలి .. ఎందుకంటే సినిమాలు . రాజకీయాలు ఒకే సమయంలో చేయలేను. రాజకీయాల్లోకి ఆలస్యంగా వచ్చాను గనుక, చేసేందుకు చాలా పనులు వున్నాయి. ఆ పనులన్నీ కూడా త్వరత్వరగా చేస్తూ వెళ్లాలి" అని చెప్పుకొచ్చారు. కమల్ మాటల వలన ఆయన ఇక సినిమాలను దూరం పెట్టనున్నారనే విషయం స్పష్టమవుతోంది. 
Go Back to Shorts
kamal

More Telugu News