Andhra Pradesh: మనుషులకు జగన్, కరుణాకర్ రెడ్డి విలువ ఇవ్వరు: పవన్ కల్యాణ్

  • ‘ఓటు’ అనే ఆయుధంతో వీరికి బుద్ధి చెప్పాలి
  •  జగన్ ది తనకు ఊడిగం చేయాలనే మనస్తత్వం 
  • దళితులను వాడుకుని వదిలేసే వారిని నమ్మొద్దు
మనుషులకు జగన్, కరుణాకర్ రెడ్డి విలువ ఇవ్వరని, ‘ఓటు’ అనే ఆయుధంతో వీరికి బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోరారు. తిరుపతిలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ సీమ జిల్లాల్లో వారి ఇళ్ల మధ్య నుంచి నడిచి వెళ్లాలంటే చెప్పులు చేతిలో పట్టుకుని వెళ్లే పరిస్థితులున్నాయని అన్నారు.

జగన్ ది తనకు ఊడిగం చేయాలని అనుకునే మనస్తత్వం అని, దళితులను వాడుకుని వదిలేసే వారిని నమ్మొద్దని సూచించారు. దళితులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఎన్నాళ్లీ వైసీపీ పల్లకీ మోస్తారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు వాళ్ల కుటుంబాలే ఉండాలని కోరుకుంటున్నారని, మనల్ని అణగదొక్కుతూ ముందుకెళ్తున్నారని, వైసీపీ లాంటి పార్టీకి బుద్ధి చెబితేనే దళితులకు న్యాయం జరుగుతుందని, బలమైన సామాజిక మార్పుకోరుకుంటున్నామని అన్నారు.
Andhra Pradesh
janasena
Pawan Kalyan
YSRCP

More Telugu News