Chandrababu: మమ్మల్ని లొంగదీసుకోవడం ప్రపంచంలో ఎవరి వల్లా కాలేదు... నువ్వెంత?: కేసీఆర్ పై చంద్రబాబు ఫైర్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో కూర్చుని జగన్ చెప్పే పనులన్నీ చేస్తున్నాడని మండిపడ్డారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసు హైకోర్టులో కొట్టివేస్తే, మళ్లీ కింది కోర్టులో కేసు వేసి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎవరిచ్చారు నీకీ అధికారం? అంటే, నీ ఇష్టప్రకారం మా ఆస్తులపై పడతావా? తెలంగాణలో మా ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తావా? కేసీఆర్, నిన్ను వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండు! మావాళ్లలో నీపై ఆవేశంతో రక్తం మరిగిపోతోంది. మమ్మల్ని లొంగదీసుకోవడం ప్రపంచంలో ఎవరి వల్లా కాలేదు, నీ వల్ల అవుతుందా?" అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
KCR

More Telugu News