Andhra Pradesh: సెల్ఫ్ గోల్స్ కొట్టుకోవడంలో జగన్ నెంబర్ వన్: కుటుంబరావు

  • 2014కు ముందు ‘కాంగ్రెస్’తో జగన్ లాలూచీ పడ్డారు
  • ఇప్పుడు మోదీ, కేసీఆర్ తో కలిశారు 
  • జగన్ తనపై కేసులు లేకుండా చేసుకోవాలని చూస్తున్నాడు
సెల్ఫ్ గోల్స్ కొట్టుకోవడంలో జగన్ నెంబర్ వన్ అని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సెటైర్లు వేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు, తన ఆస్తులను కాపాడుకునేందుకు మోదీ, కేసీఆర్ తో జతకట్టాడని ఆరోపించారు. జగన్ ఆలోచనా విధానం ఏవిధంగా ఉంటుందని ఓ సారి ఆలోచిస్తే.. 2014కు ముందు కాంగ్రెస్ పార్టీతో లాలూచీ పడి జగన్ బెయిల్ తెచ్చుకున్నారని, జగన్ తల్లి విజయమ్మ ప్రణబ్ ముఖర్జీ కాళ్లపై పడితేనే కదా ఈ బెయిల్ వచ్చిందని ఆరోపించారు. అదేవిధంగా, ఇప్పుడు కూడా జగన్ ఆలోచిస్తున్నారని, మోదీ ప్రభుత్వం మళ్లీ వస్తే, తనపై ఉన్న ఈ కేసులను ఏదోవిధంగా కొట్టేయించుకోవాలని చూస్తున్నారని అన్నారు. 
Andhra Pradesh
Guntur District
kutumbarao
jagan

More Telugu News