Andhra Pradesh: నారా లోకేశ్ కు ఖర్చుల కోసం రూ.2,000 నోటు ఇచ్చిన కనకమహాలక్ష్మి.. అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ మంత్రి!

  • మంగళగిరిలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం
  • మంత్రికి రూ.10,005 ఇచ్చిన మహిళా సంఘం సభ్యులు
  • ఎన్నికల్లో గెలిచి మంగళగిరి అభివృద్ధి కోసం పనిచేస్తానన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో అన్నివర్గాల ప్రజలను కలుసుకుంటూ తనకు ఓటేయాలని కోరుతున్నారు. తాజాగా మంగళగిరిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మన్నెం కనకమహాలక్ష్మి అనే మహిళ రూ.2,000ను ఖర్చుల కోసం లోకేశ్ కు అందజేశారు. అలాగే శ్రీలక్ష్మి మహిళా సంఘం సభ్యులు మరో రూ.10,005 లోకేశ్ కు ఇచ్చారు. దీనిపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ..‘ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం మన్నెం కనకమహాలక్ష్మి గారు రూ.2000, శ్రీ లక్ష్మీ మహిళాసంఘం సభ్యులు రూ.10,005 లను నాకు అందజేశారు. వారి అభిమానానికి సదా కృతజ్ఞుడిని. మీ ఆశీర్వాదంతో తప్పకుండా  విజయం సాధించి మంగళగిరి అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి  కట్టుబడి పనిచేస్తాను’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Nara Lokesh
Twitter
Telugudesam

More Telugu News