viskhapatnam: మినీ భారతదేశం గాజువాక...విశాఖ నాకు తల్లిలాంటిది: పవన్‌కల్యాణ్‌

  • అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నా
  • నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించండి
  • గెలిపిస్తే మీ కోసం పోరాడుతా
వివిధ మతాలు, కులాలు, ప్రాంతాల వారితో నిండివున్న గాజువాక ప్రాంతం మినీ భారతదేశంలాంటిదని, తల్లిలాంటి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఇదేనని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. గురువారం ఆయన గాజువాకలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సగటు మనిషి బతికే ప్రాంతం గాజువాక అని, అందుకే ఈ ప్రాంతమంటే ఇష్టమని చెప్పారు. ఇన్ని పరిశ్రమలున్నా ఇక్కడి వారు ఉపాధి కోసం అల్లాడుతున్నారని, కాలుష్యం కోరల్లో చిక్కుకుని నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలో మార్పులతోనే ఇటువంటి సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. 'నన్ను గెలిపిస్తే మీ తరపున నేను పోరాడుతా. ఉపాధి, కాలుష్యం, రైతు సమస్యలపై అలుపెరుగని పోరాటం జరుపుతా'నని హామీ ఇచ్చారు.
viskhapatnam
gajuwaaka
janasena
Pawan Kalyan

More Telugu News