Mahesh Babu: మహేశ్ బాబు నన్ను బాగా ఆటపట్టిస్తాడు: నటి హేమ

  • పోకిరి'కి ముందు చాక్లెట్ బాయ్ లా ఉండేవారని అన్నాను
  • ఆ తరువాతే మగాడిలా అనిపించారని చెప్పాను
  •  ఈ తింగరితనం ఎప్పటి నుంచి అని మహేశ్ అన్నాడు
నటిగా హేమకి మంచి పేరుంది .. విభిన్నమైన పాత్రలను చాలా తేలికగా చేసేయడం ఆమె ప్రత్యేకత అని కూడా చెబుతుంటారు. అలాంటి హేమ తాజా ఇంటర్వ్యూలో మహేశ్ బాబును గురించి ప్రస్తావించారు. "షూటింగు స్పాట్ లో మహేశ్ బాబు నన్ను బాగా ఆటపట్టిస్తుంటారు. నేను అద్దం చూసుకుంటూ వుంటే .. 'మీకసలు ఫేసే లేదు .. ఎందుకు అద్దం చూసుకుంటున్నారు .. అద్దం పక్కన పెట్టండి' అంటారు.

'పోకిరి' సినిమా వరకూ మీరు అమూల్ బేబీ .. చాక్లెట్ బాయ్ లా కనిపించారు. అందువలన నేను మిమ్మల్ని పట్టించుకోలేదు '.. పోకిరి' తరువాతనే మీరు మగాడిలా కనిపించారు' అంటూ నేను కూడా ఆయనను ఆటపట్టిస్తాను. 'ఈ తింగరితనం ముందునుంచి ఉందా .. మధ్యలో వచ్చిందా?' అని ఆయన అంటారు. అలా ఒకరినొకరం ఆటపట్టించుకుంటూ ఉంటాము. సాధారణంగా ఆయన ఎవరితోనూ జోకులు వేయరు .. అలాంటి ఆయన నాతో సరదాగా మాట్లాడతారు" అని చెప్పుకొచ్చారు.
Mahesh Babu
hema

More Telugu News