Andhra Pradesh: మంగళగిరిలో ఎన్నారైల సందడి.. నారా లోకేశ్ కు ఓటేయాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం!

  • సింగపూర్ టీడీపీ ఫోరం తరఫున ప్రచారం
  • ఏపీ అభివృద్ధికి టీడీపీని మరోసారి గెలిపించాలని వ్యాఖ్య
  • చంద్రబాబు వల్లే తమకు ఉద్యోగాలు వచ్చాయన్న యువత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నారైలు, విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు సొంత రాష్ట్రానికి తిరిగివస్తున్నారు. తమ అభిమాన నేతలు, పార్టీలకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా సింగపూర్ టీడీపీ ఫోరం తరఫున పలువురు యువకులు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ కు మద్దతుగా ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు. ఈసారి నారా లోకేశ్ కు ఓటేయాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వారికి వివరించారు.

ఈ సందర్భంగా వారంతా మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే తమకు సింగపూర్ లో ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీడీపీని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మంగళగిరిలో లోకేశ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు.
Andhra Pradesh
Nara Lokesh

More Telugu News