Pawan Kalyan: జగన్ కు బలం ఉందని నమ్మి అలీ వైసీపీలోకి వెళ్లాడు: పవన్ కల్యాణ్

  • యాక్టర్లు, పాప్యులారిటీ రెండూ వేరువేరు
  • పాప్యులారిటీ వల్ల జనాలు చప్పట్లు కొడతారు
  • ఆ చప్పట్లను నేను నమ్మను
యాక్టర్లు, పాప్యులారిటీ రెండూ వేరువేరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పాప్యులారిటీ వల్ల జనాలు చప్పట్లు కొడతారని, ఆ చప్పట్లను సీరియస్ గా తీసుకోకూడదని చెప్పారు. ఇలాంటి వాటిని తాను నమ్మనని అన్నారు. తనకు సన్నిహితుడైన అలీ వైసీపీలో చేరిన అంశంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలోనైనా చేరే అవకాశం అలీకి ఉందని, వైసీపీ అధినేత జగన్ కు ఎక్కువ బలం ఉందనే నమ్మకంతో అలీ ఆ పార్టీలోకి వెళ్లాడని అన్నారు. అది అలీ వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.

పవన్ కు, అలీకి మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో, అలీ జనసేనలో చేరుతారని అందరూ భావించారు. ఇదే సమయంలో ఆయన అటు టీడీపీ, ఇటు వైసీపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపారు. చివరకు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుని, ఆ పార్టీ తరపున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
Pawan Kalyan
ali
jagan
ysrcp
janasena
tollywood

More Telugu News