Andhra Pradesh: జీవితమంతా మందిపై పడి బతకడమేనా చంద్రబాబూ.. ఇది ఎంగిలి కూడు తినడం కాదా?: విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు

  • లోకేశ్ కోసం ఓటుకు రూ.10,000 ఇస్తున్నారు
  • విజయవాడ, గుంటూరులో మార్చుకునేలా కూపన్లు అందజేస్తున్నారు
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ‘మందలగిరి మాలోకా’నికి స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో సీటు కోసం అప్పట్లో చంద్రబాబు ఓ స్పాన్సర్ తో రూ.50 కోట్లు డొనేషన్ కట్టించారని ఆరోపించారు. తాజాగా ఇప్పుడు అమరావతికి డిజైన్లు ఇచ్చిన సంస్థలతో హైదరాబాద్ లో రూ.300 కోట్ల ప్యాలెస్ కట్టించుకున్నారని విమర్శించారు. ‘జీవితమంతా మందిపై పడి బతకడమేనా చంద్రబాబూ? ఇది ఎంగిలి కూడు తినడం కాదా?’ అని దుయ్యబట్టారు.

మంగళగిరిలో లోకేశ్ గెలుపు కోసం టీడీపీ నేతలు ఓటుకు రూ.10,000 పంచుతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. నగదుకు బదులుగా కూపన్లు ఇస్తున్నారనీ, వాటిని విజయవాడ, గుంటూరులో ఫలానా వ్యక్తికి ఇస్తే డబ్బులు ఇస్తున్నారని అన్నారు. ఎన్ని తాయిలాలు ఇచ్చినా మంగళగిరిలో వైసీపీ నేత ఆర్కే గెలుపును ఆపడం చంద్రబాబు తరం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Telugudesam
Nara Lokesh
Chandrababu
Twitter

More Telugu News