Congress: ఆగని వలసలు... బీజేపీలో చేరనున్న కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఆనందభాస్కర్‌

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ కాంగ్రెస్‌ నుంచి నిష్క్రమించిన సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్‌ కమల దళంలో చేరాలని నిర్ణయించుకున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భాస్కర్‌ ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర నాయకత్వం తనపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అధిష్ఠానం పెద్దలు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోకుండా అవమానిస్తున్నారని మధనపడుతున్న ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లోగా ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు.
Go Back to Shorts
Congress
BJP
rapolu anadbhaskar

More Telugu News