Kanna Lakshminarayana: ఒక పార్టీకి భజన చేస్తున్న కొన్ని పత్రికలు: కన్నా లక్ష్మీనారాయణ

  • ప్రజలను మభ్య పెడుతున్న పత్రికలు
  • కేంద్రం చేసే అభివృద్ధిని చంద్రబాబు ఖాతాలో వేస్తున్నారు
  • తప్పుడు సమాచారం అందిస్తున్నారన్న కన్నా
కొన్ని తెలుగు దిన పత్రికలు, చానెళ్లు ఒక పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని, ప్రజలను మభ్యపెడుతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "ప్రజలకు నిష్పక్షపాతంగా వార్తలు అందజేయవలసిన బాధ్యత మరిచి చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకుని అబద్ధపు సమాచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పత్రికలు" అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హ్యాష్ ట్యాగ్ ను కన్నా జత చేశారు. బాబు తరఫున వకాల్తా పుచ్చుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని... కేంద్ర ప్రభుత్వం చేసే ఆ అభివృద్ధిని చంద్రబాబు ఖాతాలో వేస్తూ, ప్రజలకు తప్పుడు సమాచారం అందించడంలో ఈ పత్రిక ఎల్లప్పుడూ ముందుందని అన్నారు.
Kanna Lakshminarayana
Telugudesam
Chandrababu
BJP
ABN
Andhrajyothi

More Telugu News