Narendra Modi: మోదీకి ఎదురుదెబ్బ.. నమో టీవీ ఇప్పుడెందుకు ప్రారంభిచారంటూ ప్రశ్నించిన ఈసీ!

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికలు మరికొన్నిరోజుల్లో జరగనుండగా ఎన్నికల సంఘం కేంద్రానికి నోటీసులు పంపించింది. ఓవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నమో టీవీ చానల్ ఎలా ప్రారంభిస్తారంటూ ఈసీ ప్రశ్నించింది. అంతకుముందు, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నమో టీవీ ప్రారంభించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై వెంటనే స్పందించిన ఈసీ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను వివరణ కోరింది. దాంతో పాటు దూరదర్శన్ కు కూడా నోటీసులు జారీచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఓ కార్యక్రమాన్ని ఎందుకు ప్రసారం చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ సంజాయిషీ కోరింది.
Go Back to Shorts
Narendra Modi
Namo Tv

More Telugu News