విజయసాయిరెడ్డీ! మీ పని మీరు చూస్కోండి: పవన్ కల్యాణ్ సలహా

షార్ట్స్‌లో చూడండి
టీడీపీతో జనసేన పార్టీ రహస్య పొత్తు పెట్టుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ఓ వ్యాఖ్య చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విశాఖపట్టణం జిల్లాలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గాలలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రచారం నిర్వహించి, పవన్ పై విమర్శలు చేయాలని విజయసాయిరెడ్డి అన్నారు.

ఈ విషయమై ‘టీవీ 99’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ని ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ, అసలు, ఎవరేం చేయాలో చెప్పడానికి విజయసాయిరెడ్డి ఎవరు, ఆయన పని ఆయన చూసుకోవాలని హితవు పలికారు. ఏ పార్టీ ఎలా ఉండాలో చెప్పడానికి విజయసాయిరెడ్డి, జగన్, చంద్రబాబు ఎవరు? అని ప్రశ్నించారు. పిచ్చిమాటలు మాట్లాడేవారికి కాలమే తగిన సమాధానం చెబుతుందని అన్నారు. చంద్రబాబుకు లేదా జగన్ కు ఊడిగం చేయకపోతే ఎవరినైనా అవకాశవాదిగానే చిత్రీకరిస్తారని, ‘మేము ఏంటో వీళ్లిద్దరికీ చూపిస్తా’ అని పవన్ వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
janasena party
Pawan Kalyan

More Telugu News