Chandrababu: డబ్బులుంటే సరిపోదు, చేసే దిల్ ఉండాలి: కేసీఆర్ పై చంద్రబాబు వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా వినుకొండ రోడ్ షోలో అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించేలా ప్రసంగించారు. తమకు మొదటి విరోధి మోదీ అని, రెండో విరోధి కేసీఆర్ అని, రాష్ట్ర ద్రోహి జగన్ అంటూ నిప్పులు చెరిగారు. ఈ ముగ్గురూ కలిసి రాష్ట్రాన్ని దెబ్బతీసే కుట్రకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. వ్యవసాయం చేసిన రైతు బిడ్డనని, ఏనాడైనా కేసీఆర్ వ్యవసాయం చేశాడా? మోదీకి వ్యవసాయం గురించి ఏం తెలుసు? అంటూ నిలదీశారు.

రాష్ట్ర ప్రజల కోసం ఏం చేయాలో అంతా చేశానని, తాను తీవ్రంగా కష్టపడ్డానని తెలిపారు. చరిత్రలో లేని విధంగా 29 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. "కేసీఆర్ అంటాడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడతాడట! కట్టాడా డబుల్ బెడ్ రూమ్? డబ్బులుంటే సరిపోదు తమ్ముళ్లూ! చేసే దిల్లుండాల! ఊరికే మాటలు చెబితే సరిపోదు. మనసుండాలి. చేసే చొరవుండాలి! మోదీ, కేసీఆర్ ల మాటలు కోటలు దాటతాయి కానీ, చేతలు గడప కూడా దాటవు" అంటూ విమర్శల వర్షం కురిపించారు.
Go Back to Shorts
Chandrababu
KCR
Narendra Modi

More Telugu News