Ram Charan: తనకు తగిలిన గాయంపై స్పందించిన రామ్ చరణ్

  • షెడ్యూల్ చాలా బాగా జరుగుతోంది
  • దురదృష్టవశాత్తు నాకు గాయమైంది
  • వైద్యులు విశ్రాంతి తీసుకోవాలన్నారు
హీరో రామ్‌చరణ్ నేటి ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. కాలు బెణకడంతో చిన్న గాయమైంది. చెర్రీ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో పూణేలో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ కూడా వాయిదా పడింది.

అయితే తనకు తగిలిన గాయంపై చెర్రీ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ‘‘ఆర్ఆర్ఆర్’ షెడ్యూల్ చాలా బాగా జరుగుతోంది. కానీ దురదృష్టవశాత్తు నేను వర్కవుట్ చేస్తుండగా నా యాంకెల్‌కు దెబ్బ తగిలింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. వైద్యులు కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోమని నాకు సూచించారు. మూడు వారాల్లో మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటా’’ అని చెర్రీ పోస్ట్ పెట్టాడు.
Ram Charan
RRR
Pune
Doctors
Ankle

More Telugu News