Peddapalli District: కేసీఆర్ దొరా! ఎప్పటికైనా ఓడిపోతావు: విజయశాంతి

  • మేము మాట్లాడిన వాస్తవాలు బయటకు రావు
  • ఎందుకంటే, మీడియా గొంతునూ కేసీఆర్ నొక్కేశారు
  • కేసీఆర్ ను ఇక ప్రజలు నమ్మరు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీ-కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షో లో ఆమె మాట్లాడుతూ, తాము ఎన్ని వాస్తవాలు మాట్లాడినా అవన్నీ బయటకు రావని, ఎందుకంటే, మీడియా గొంతు కూడా కేసీఆర్ నొక్కేశారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందన్న భయంలో కేసీఆర్ ఉన్నారని అన్నారు.

‘దొరా! ఎప్పటికైనా ఓడిపోతావు దొరా. ఇప్పటికే ప్రజలు నీకు చాలా టైమ్ ఇచ్చారు. ఇక నమ్మరు. టైమ్ దగ్గరపడింది. మెల్లమెల్లగా దిగుతావు. మేము ఉదయించే సూర్యులం, నువ్వు అస్తమించే సూర్యుడివి’ అని విమర్శించారు. 
Peddapalli District
kcr
Congress
vijayashanti

More Telugu News